నేను హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు : చిన్నారెడ్డి

నేను హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు : చిన్నారెడ్డి
  • వనపర్తి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయలె: చిన్నారెడ్డి
  • నోటీసు వెనక్కి తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: తానెప్పుడూ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, వనపర్తి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి కాంగ్రెస్​ క్రమశిక్షణ కమిటీ ఎదుట వివరణ ఇచ్చారు. అందువల్ల తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఇటీవల వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట సభలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై, పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చిన్నారెడ్డి పలు ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయనకు షోకాజ్ నోటీసు జారీ అయింది. దీనిపై శనివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. 40 ఏళ్లుగా తాను కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని, పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను సభ్యత్వం తీసుకుంటే ఇప్పటివరకు ఏనాడూ పార్టీని వీడలేదన్నారు. ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాలను తాను దేవాలయాలుగా భావిస్తానని, కాంగ్రెస్ అగ్రనేతలు తనకు దేవుళ్లతో సమానమన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డిపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మొదటి నుంచీ పార్టీ జెండాను మోస్తున్న నాయకుల మనోభావాలనే వ్యక్తం చేశానని, ఎవరి వ్యక్తిత్వాన్ని తాను కించపరచలేదని ఆ లేఖలో వివరించారు